మనం చదువుకునే రామాయణం ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర. ఆ ఇక్ష్వాకు వంశ రాజు పాలించే రాజ్యం కోసల. ఆ కోసల రాజ్య రాజధాని అయోధ్య. రామాయణ బాల కాండలో మనకి అయోధ్య వర్ణన వస్తుంది. కోసల రాజ్యం సరయు నదీతీరంలో ఉండేది. ఆ దేశము ఎల్లపుడు ధన ధాన్యములతో నిండి ఎంతో ఆనందముగా వుండే ప్రజలతో అలరారుతుండేది. ఒక దేశములో ఏవి ఉండాలో మనకి అయోధ్య వర్ణన తెలియ చేస్తుంది. అయోధ్య లో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. ఎన్నో ఉద్యానవనములతో ఎంతో అందముగా తీర్చి దిద్దబడిన దేశము. ఆ దేశము చుట్టూరా దుర్భేద్యమైన ఎత్తైన ప్రాకారములు ఉండేవి. ఆ ప్రకారము వెలువల లోతైన అగడ్త ఉండేది.

ఆ నగరములో ఆవులు, ఏనుగులు, గుఱ్ఱములు, ఒంటెలు, గాడిదలతో సంవృద్ధిగా ఉండేది. నగరము మొత్తము వర్తకులతో, సామంతరాజులతో ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండేది. రాజ భావనములతో ఎత్తైన మెదలతో ఎంతో సంవృద్ధిగా ఉండేది. నగరమంతా సమతల ప్రదేశములో నిర్మించబడినది. ఈ ఒక్క ప్రదేశము వృధాగా వదిలి పెట్టబడలేదు. ఎన్నో క్రీడాశాలలతో, గురుకులాలతో అందరికి విద్య అందుబాటులో ఉండేది.

ఆ నగరములో ఎల్లపుడు సంగీత వాద్య కచేరీలు జరుగుతూ ఉండేవి. యోధులకు పుట్టినిల్లు అయోధ్య. విలువిద్యలో సిద్దహస్తులు. శబ్దబేధిలో నైపుణ్యము కలవారు, ఒట్టి చేతులతో క్రూర మృగములను సంహరించే బలపరాక్రమము కలిగినవారు ఎందరో అయోధ్యలో ఉండేవారు.

ఎంతో మంది వేద వేదాంగములు చదివినవారు, మంచి గుణములతో అలరారేవారు, సహృదయులు, అతిధులను గౌరవించేవారు, నిత్యా అన్నదానము చేసేవారు, ఎల్లపుడు సత్యమునే పలికేవారు, బుద్ధిమంతులు, స్వచ్ఛమైన జీవితమును గడిపేవారు ఆ దేశములో పౌరులుగా ఉండేవారు. ప్రజలందరూ నిత్య సంతోషులు. అత్యాశాపరులు కాదు. ఎక్కడ కాముకులు, లోభులు, క్రూరులు, పేదలు వెదకినా కనపడేవారు కాదు.

అందరు పౌరులు తప్పకుండ చెవులకు కుండలములు ధరించేవారు. తలపై కిరీటము ధరించేవారు. పుష్పమాలతో అలంకరించుకునేవారు. ఆకలితో అలమటించేవాడు లేడు. దాన ధర్మములు చెయ్యని వాడు లేడు. ప్రతి ఒక్కరు ఇంద్రియ నిగ్రహముతో ఉండేవారు. దొంగలు లేరు. దొంగతనాలు లేవు. నిత్యాగ్నిహోత్రులు. అతిధి పూజ చేసేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తయిన చూసేవారు కాదు. నాస్తికులు లేరు. విద్య నేర్చుకొని వారు లేరు. ఎవరికీ ఎటువంటి బాధలు లేవు.

అందరికి రాజ భక్తి చాల ఎక్కువ. అందరు దీర్ఘాయుష్కులు. పెద్దవారు బతికి ఉండగా చిన్నవారు చనిపోయేవారు కాదు. భద్ర గజములు, మంద్ర గజములు, మాడ గజములు మొదలగు జాతుల ఏనుగులతో అయోధ్య నిండి ఉండేది. శత్రువు అనేవాడు లేకుండా రాజయమును పాలించేవాడు దశరధుడు.

ఈ వర్ణన అయోధ్యది. మనం ఆ వర్ణన చదివి మన నగరమును కూడా ఆలా తీర్చిదిద్దగలిగితే అదే అయోధ్య అవుతుంది.

జై శ్రీమన్నారాయణ

Search LAtelugu