గరుడ పురాణం ప్రతి రోజు చదువుకోవాలి. ప్రతి ఇంట్లో ఉండాలి. 

ధర్మ ధృడ బద్దమూలో    నిగమ స్కంద    పురాణ శాఖాజ్ఞహ
క్రతు కుసుమో    మోక్ష ఫలో    మదుసూదనః పాదపూజయతి

గరుడ పురాణం లోని ఆ పై పద్యం లో - విష్ణువు అనే చెట్టువుంది. ఆ చెట్టు మూలం ధర్మం. ఆ చెట్టు కందము వేదములు. ఆ చెట్టుయొక్క కొమ్మలు పురాణములు. క్రతువులు (వేదము చెప్పిన కర్మలు) ఆ చెట్టు పువ్వులు. క్రతువులు అంటే సత్కర్మలు, సదాలోచనలు. ఆ చెట్టు ఫలము మోక్షము. అలాంటి చెట్టుకు నమస్కారము అని దాని భావన.

ఈ దేహాన్ని అంటిపెట్టుకుని మనల్ని బాధించే అంశములు ప్రాకృతికంగా చాల వున్నాయి. దేహగతంగా వున్న కర్మ వాసనల నుండి నెమ్మదిగా బయటపడాలి. వేదాంతము అనేది పండు. ఆ పండు రావడానికి మూలం వేదమనే వృక్షం. వేదం లేకుండా వేదాంతం లేదు, తత్త్వం లేదు, తత్వ జ్ఞానం లేదు.

భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది

భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తి యొక్క అరికాలు పాదాలు గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయి అని తెలుసుకుంటారు.

వెండి తీగ
ఆత్మకి శరీరానికి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు బంధింపబడిన ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది అయినా కూడా, వెండి తీగ తెగిపోవడం వలన, శరీరంలో దూరగలిగినా అక్కడ ఉండలేక పోవడం వలన, ఆత్మ ఇక శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వలన ఆత్మ, అలా శరీరం నుండి పైకి, ఇంకా పైకి ఆకర్షింపబడుతుంది.

మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ

కేశవాయనమః
నారాయణాయనమః
మాధవాయనమః

అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో చానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము.

మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

పూర్వం యజ్ఞవల్క్య మహర్షి మిథిలా నగరంలో నివసిస్తూ ఉండేవారు. ఆయన గొప్ప మహర్షి అని ఆ రోజుల్లో ఎంతో పేరుండేది. నిత్యం యజ్ఞయాగాలను చేస్తూ జీవితం గడుపుతుండేవారు. రాజులు, రారాజులు, తోటి మునులు, ఋషులు ఆయన ఔన్నత్యాన్ని నిరంతరం కీర్తిస్తూ ఉండే వారు.

ఇలా ఉండగా ఓ రోజున ఆయన ఆశ్రమంలోకి ఒక ముంగిస పరుగెత్తుకురావటం ఆయన కంటపడింది. వెంటనే పక్కనున్న వారితో ఆ ముంగిస ఆశ్రమం లోపల ఉంచిన పాలు తాగటానికి వస్తున్నట్లుందని, దాన్ని వెళ్ళగొట్టమని చెప్పారు. ఆ చెప్పటంలో ముంగిసను పరిపరివిధాల పరుషపదజాలాన్ని ఉపయోగించి నిందించారు ఆ మహర్షి. వచ్చిన ముంగిస సాధరాణమైనదికాదు. దానికి అత్యంత జ్ఞానశక్తి ఉంది. దాంతో ఆ ముగింస మానవ భాషలో యజ్ఞవల్క్య మహర్షిని చూసి మాట్లాడటం ప్రారంభించింది.