కర్ణుడు, కృష్ణుని అడిగాడు-

  • నేను జన్మించగానే నా తల్లి నన్ను వదిలేసింది. అక్రమ సంతానం అవ్వడం నా తప్పా?
  • నేను క్షత్రియ పుత్రుడిని కాదని ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పలేదు.
  • పరశురాముడు కూడా నన్ను క్షత్రియుడిగా గుర్తించి, నాకు వచ్చిన యద్ధ విద్య, అవసరమైనప్పుడు మరిచిపోయేలా శాపం ఇచ్చాడు.
  • నేను వేసిన బాణం అనుకోకుండా ఒక ఆవుకి తగిలి మరణించింది. ఇందులో నా తప్పు లేకోపోయనా, ఒక ఋషి నన్ను శపించాడు.
  • ద్రౌపతి స్వయంవరంలో నాకు అవమానం జరిగింది.
  • మాతా కుంతీ తన బిడ్డలను కాపాడుకోవడం కోసం మాత్రమే చివరిగా నాకు నా జన్మ రహస్యాన్ని చెప్పింది.
  • నాకు లాభించినది ఏదైనా ఉందంటే అది అంతా దుర్యోధనుడి ద్వారా మాత్రమే లభ్యమైంది.
  • కాబట్టి నేను దుర్యోధనుడి పక్షాన పోరాడడం తప్పు ఎలా అవుతుంది?

ఒక నాడు నారద మహా ముని పులస్త్యుని నక్షత్ర పురుషుని గురించి తెలియ చేయమని అడుగగా, అప్పుడు పులస్త్యుడు చెప్పిన విషయం...అన్ని నక్షత్ర మండలములు విష్షును లో వివిధ అంగములలో నిక్షిప్తమై వున్నాయి. అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రములు పాదములలో, పూర్వాభాద్ర, శతభిషా నక్షత్రములు ఉరువులలో, ఉత్తరాభాద్ర నక్షత్రం మోకాలులో, స్వాతి మరియు విశాఖ నక్షత్రములు స్వామి హృదయములో, ఇలా ప్రతి నక్షత్రము ఒక్కొక్క ఆంగములో వున్నదని తెలియ చేశారు. విష్ణువుని నక్షత్ర అంగ రూపములో ధ్యానిస్తే సకల రోగముల నుండి విముక్తి పొంది అనారోగ్య రహిత జీవితముని పొందుతారు.

సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి.

సుగ్రీవుడు చెప్పిన వివరాలు...

వివేకం, వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం, మోక్షం....  ఈ నాలుగింటిని సాధన చతుష్టయం అంటారు.

వీటిని గుర్తెరిగి మనిషి సాధన సాగిస్తే.. బ్రహ్మ విచారణ కలుగుతుంది. ఈసాధన తోనే మనిషి మాధవుడవుతాడు. ఈ సాధనా క్రమంలో అవరోధాలు ఎన్నో వస్తుంటాయి. వాటిని ‘నౌకాగ్ర కాకవత’ పద్ధతిలో అధిగమించాలని చెబుతారు ప్రాజ్ఞులు. ఇంతకీ ‘నౌకాగ్ర కాకవత’ అంటే ఏమిటంటే...

షోడశోపచారములు చేయు విధానము:

ఎవరైనా ఒక అతిథి, ఒక బంధువు ,మనకు ప్రీతి కలిగించేవారు, లేదా మనము ఒక ఉద్యోగి అయితే మన పై అధికారి,మనకు సహాయం చేసినవారు, మనకు సహాయం చేసేవారు, గురువులు, ఎల్లవేళలా మన శ్రేయోభిలాషులు, మన ఇంటికి వస్తే, ఎలా గౌరవిస్తాము. ఎలా ఉపచారములు (సేవలు) చేస్తాము మరీ చెప్పాలంటే క్రొత్తగా వివాహము చేసుకొన్న దంపతులు, అల్లుడు క్రొత్తగా ఇంటికి వచ్చినా, లేదా క్రొత్త కోడలు క్రొత్తగా మన ఇంటికి వచ్చినా, వారికి చేయు సేవలు,ఉపచారములు ఎలా ఉంటాయో ఊహించండి.

మరి మనకు సకల శుభములను, జీవించుటకు జీవమును, జీవిత మును ప్రసాదించిన ఆ పరమేశ్వరుని పట్ల మనము ఎంత వినయంగా, ఎంత భక్తిగా, ఎంత శ్రద్దగా, త్రికరణ శుద్దిగా మసలుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఆలోచించండి? మనము చేసే ఉద్యోగము ఆయన ఇచ్చింది కాదా? మనకున్న ఈ సర్వ సంపదలు, వాహనములు, ప్రతి పూట మనము తినే తిండి ఆయన ఇచ్చినదే. చివరకు మనకు జీవాధారమై, మనము పీల్చుచూ, విడుచుచున్న గాలి ఆయనది కాదా? ఈ గాలిని మనము సృజించామా? ఈ ప్రకృతిని మనము సృష్టించామా? మనమునిత్యమూ అనుభవించే ఈ వెలుగు ఎవరిది? మరి అంతటి అంతర్యామి సర్వభూతములందు, సర్వప్రాణికోటియందు, నిండి నిమిడీ కృతమయి ఉన్న పరమేశ్వరుడు మన పూజా మందిరమునకు (మన గృహములోనికి) వచ్చి మనలను కటాక్షిస్తుంటే వారి పట్ల మనము ఎలా ప్రవర్తించాలి.