పద్యం మొదటి నుండి చదివినా, వెనుకనుండి చదివినా, యతి ప్రాసలతో సహా, అదే పద్యం వస్తుంది , ఇది అనులోమ విలోమ కందం.
నారదుడు సత్యభామ చేత పుణ్యక వ్రతము చేయించి కృష్ణుని దానముగా గైకొని ఆయనను స్తుతించిన పద్యము

నాయశరగసారవిరయ
తాయనజయసారసుభగధరధీనియమా
మాయనిధీరధగభసుర
సాయజనయతాయరవిరసాగరశయనా!

ఇది నంది తిమ్మన గారి పారిజాతాపహరణం లోనిది. మంచి శరీరము గలవాడా!సాగరశయానా!అచలమైన బుద్ధి,కట్టుబాట్లు గలవాడా! లక్ష్మీ దేవి శుభములకు స్థాన భూతుడైన వాడా! లక్ష్మీ వాసుండును,కళ్యాణరూపుండైన శరీరము గల సుందరుడా!సర్వదేవాత్మకుడవైన వాడా!నీ నీతియను,వేగమైన బాణములచే దుర్జనులను శిక్షించి సుజనులను రక్షించి ధర్మము నెలకొల్పి అందరి మెప్పును పొందిన వాడవు వామనావతారంలో ఆకాశము నంటి సూర్యుని తేజమును మించి పోయినావు.అని నారదుడు స్తుతించెను.

 

14 లోకాలు వివిధ పరిధుల్లో ఈ సృష్టిలో ఉన్నాయి. విశ్వంలో ఈ 14 లోకాలు ఉండడమే కాదు, భూలోకంలో కూడా వివిధ దేశాలను వీటికి అన్వయించి చెప్పే విధానం ఉంది, అలాగే ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది. మన శరీరంలో మూలాధారం నుంచి పైకి, క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలనే 6 చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి 7. అలగే మూలాధారానికి దిగువన కూడా 7 చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ కలిపి 14. వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి, అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసుకోవచ్చు. 

ఇప్పుడు మనం కొన్ని వేల రూపయలు ధారపోసి కమ్యునికేషన్ స్కిల్స్ అని నేర్చుకుంటున్నాం. పురాణ గ్రంధాలలో వీటి గురించి చక్కగా వివరించారు. ఈ స్కిల్స్ అనేవి మనం హనుమంతుడిని నుండి నేర్చుకోవచ్చు.

మాట్లాడే విద్యకి ఉన్న గొప్పదనం ఆదికావ్యం వాల్మీకి రామాయణంలోనే కనబడుతుంది. హనుమంతుడు అంటే రామభజన చేసేవాడని సామాన్యుల భావన. కాని వాల్మీకి రామాయణంలో హనుమంతుడు కేవలం భజన పరుడుకాదు. వేదత్రయాన్ని అధ్యయనం చేసినవాడు. కార్యదీక్షా పరుడు, ఉత్తమ మంత్రి, దూత, నేత, అనుచరుడు, సేవకుడు. ఏ స్థానంలో ఉంటే ఆ ధర్మాన్ని సక్రమంగా, ఆదర్శవంతముగా నిర్వహించిన వాడు.

చిన్న‌ సంఘటన.

పూర్వము భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు. భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు. ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.

భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.

ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత. మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.

పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.

అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది.

Search LAtelugu